మనీశ్ పాండే విరవిహారం… సన్ రైజర్స్ ఘన విజయం

189
srh
- Advertisement -

ఐపీఎల్ 2020లో భాగంగా దుబాయ్‌ వేదికగా రాజస్ధాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచి ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. రాజస్ధాన్ విధించిన 155 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో 2 వికెట్లు కొల్పోయి 156 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. డేవిడ్ వార్నర్ 4,బెయిర్ స్టో 10 పరుగులు మాత్రమే చేసి వెనుదిరుగగా మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు మనీశ్ పాండే,విజయ్ శంకర్‌. ముఖ్యంగా విజయ్ శంకర్ నెమ్మదిగా ఆడినా మనీశ్ పాండే ఫోర్లు,సిక్సర్లతో విరుచపడ్డాడు. మనీశ్‌ పాండే 47 బంతుల్లో 4 ఫోర్లు ,8 సిక్స్‌లతో 83 పరుగులు చేయగా విజయ్ శంకర్ 51 బంతుల్లో 52 పరుగులతో రాణించడంతో హైదరాబాద్ గెలిచి ప్లే ఆఫ్ రేసులో నిలిచింది.

అంతకముందు టాస్ గెలిచిన సన్ రైజర్స్ …రాజస్ధాన్ రాయల్స్‌ని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. బెన్‌ స్టోక్స్‌(30: 32 బంతుల్లో 2ఫోర్లు), సంజూ శాంసన్‌(36: 26 బంతుల్లో 3ఫోర్లు,సిక్స్‌) రాణించడంతో రాజస్థాన్‌ నామమాత్రం స్కోరు సాధించింది. జేసన్‌ హోల్డర్‌(3/33) , విజయ్‌ శంకర్‌, రషీద్‌ ఖాన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు

- Advertisement -