సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టార్గెట్‌.. 155

172
Sunrisers Hyderabad

2020లో ఇవాళ 40వ మ్యాచ్ జరుగుతోంది. దుబాయ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన… రాజస్థాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. బెన్‌ స్టోక్స్‌(30:32 బంతుల్లో 2ఫోర్లు), సంజూ శాంసన్‌(36:26 బంతుల్లో 3ఫోర్లు,సిక్స్‌) రాణించడంతో రాజస్థాన్‌ ఆమాత్రం స్కోరైనా చేసింది.

ఆఖర్లో రియాన్‌ పరాగ్‌(20 12 బంతుల్లో 2ఫోర్లు, సిక్స్‌) ఫర్వాలేదనిపించాడు. సన్‌రైజర్స్‌ బౌలర్‌ జేసన్‌ హోల్డర్‌(3/33) తెలివైన బంతులతో ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. విజయ్‌ శంకర్‌, రషీద్‌ ఖాన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. కాగా, ఐపీఎల్‌లో ఇప్పటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు 12 సార్లు తలపడ్డాయి. చెరో ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి.