ఐపీఎల్‌ 2022: టాస్‌ గెలిచిన హైదరాబాద్

73
- Advertisement -

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో భాగంగా నేడు రాజస్తాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. గత సీజన్‌లో ఈ రెండు జట్లు నాసిరక ప్రదర్శనతో వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కాగా ఈ సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఎన్నడూ లేనంత బలంగా కనిపిస్తుండగా.. ఇందు భిన్నంగా ఎస్‌ఆర్‌హెచ్‌ చాలా బలహీనంగా, ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగనుంది.

గత రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు 15 సార్లు తలపడగా.. ఆరెంజ్ ఆర్మీ ఎనిమిది సార్లు, రాజస్తాన్‌ రాయల్స్‌ ఏడు మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేశాయి. గత సీజన్‌లో ఈ రెండు జట్లు రెండుసార్లు తలపడగా.. ఎస్‌ఆర్‌హెచ్‌ ఒకసారి.. రాజస్తాన్‌ మరోసారి గెలిచింది. రాజస్తాన్ రాయల్స్ సారథి సంజూ సామ్సన్ కు ఇది 100వ మ్యాచ్ కావడం విశేషం.

సన్ రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్, మార్క్ రమ్, రొమారియో షెపర్డ్, అబ్దుల్ సమద్, శ్రేయస్ గోపాల్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రన్ మాలిక్, నటరాజన్

రాజస్తాన్ రాయల్స్: సంజూ సామ్సన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, యశస్వీ జైస్వాల్, జోస్ బట్లర్, షిమ్రన్ హెట్ మైర్, బౌల్ట్, యుజువేంద్ర చహల్, రవిచంద్రన్ అశ్విన్, నాథన్ కూల్టర్ నీల్, రియాన్ పరాగ్, ప్రసిధ్ కృష్ణ

- Advertisement -