మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థి నేతలు..

112
Minister KTR

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన విద్యార్థి నేత కే. కిషోర్ గౌడ్ కు రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులుగా అవకాశం కల్పించినందుకు హైదరాబాద్ నగర మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ డివిజన్ కార్పొరేటర్ ఎండీ బాబా ఫసియుద్దీన్, బిసి కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థి నేతలు టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను కలిసి కృత్యజ్ఞతలు తెలిపారు.

ఉద్యమం, ఆ తర్వాత ఏర్పడిన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ విద్యార్థులకు, బడుగుబలహీన వర్గాలకు అవకాశం కల్పిస్తున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన కిషోర్ గౌడ్ కు రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులుగా అవకాశం కల్పించడం హర్షించదగ్గ విషయమన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యమకారులను భాగస్వాములను చేయాలనే ఆలోచనతో విద్యార్థి ఉద్యమకారులకు అవకాశం కల్పిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు బాబా ఫసీయుద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా మంత్రి కేటీఆర్ ఆదేశాలనుసారం మరింత ముందుకు సాగుతామని అన్నారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.