ఎమ్మెల్సీగా సురభి వాణీదేవి ప్రమాణస్వీకారం..

26
Surabhi Vanidevi Take Oath

హైదరాబాద్‌ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన శ్రీమతి సురభి వాణీదేవి శాసన మండలిలోని ప్రొటెం చైర్మన్‌ చాంబర్‌లో ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌రెడ్డి వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేకే కేశవరావు, మంత్రులు మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు సురభి వాణీదేవి.. ఈ ఏడాది మార్చిలో జరిగిన హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ తరుపున విజయం సాధించిన సంగతి తెలిసిందే. వాణీదేవికి 1,89,339 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు సురభి వాణీ చేతిలో ఓటమిపాలయ్యారు.ఈ విజయంతో మొదటిసారి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకున్నట్లయింది.