ఈ నెల 27న ‘శ్రీదేవి సోడా సెంటర్’ విడుదల..

95

సుధీర్ బాబు ఆనంది జంటగా ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా రూపొందింది. ఈ కథ అంతా కూడా గ్రామీణ నేపథ్యంలో నడుస్తుంది. హీరో లైటింగ్ చేసే సూరిబాబు పాత్రలో.. హీరోయిన్ సోడా సెంటర్ నడిపే శ్రీదేవి పాత్రలో సందడి చేయనున్నారు. విజయ్ చిల్లా – దేవిరెడ్డి శశి నిర్మించిన ఈ సినిమాకి, కరుణకుమార్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు, టీజర్, ట్రైలర్లకు, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించారు. ఈ నెల 27వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను విడుదల చేశారు. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.