మూసిన థియేటర్లను కూడా ఈ సినిమాతో తెరిపిస్తా..

268
- Advertisement -

టాలీవుడ్‌ యంగ్‌ హీరో విష్వ‌క్‌సేన్ తాజాగా నటించిన చిత్రం పాగ‌ల్‌. నివేదా పేతురాజ్, సిమ్రాన్ చౌద‌రి, మేఘా లేఖ హీరోయిన్స్‌గా న‌టించారు. నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన సినిమా ఆగ‌స్ట్ 14న ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్స్‌లో విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ఈరోజు చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిత్ర హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ – ఈ సక్సెస్ మీట్‌లో నేను ఎక్కువగా మాట్లాడతాను..నేను మధ్యాహ్నం ఈ సినిమా చూశాను. అందుకే సక్సెస్ మీట్ అంటున్నా.. నేను నా లైఫ్‌లో చాలా మందిని లవ్ చేసా అంటారు. కానీ దానికి క్యాలిక్యులేషన్ ఏంటో తెలుసా ? ముందు అందంగా ఉందో లేదో చూస్తారు. డబ్బును చూస్తారు. ఆ తర్వాత మన కులమా కాదా అని చూస్తారు. ఇలా చాలా లెక్కలు వేసుకుని ప్రేమిస్తారు. కానీ ఇవేమి లేకుండా ప్రేమించే వాడే ప్రేమ్‌. తన తల్లి ప్రేమను వెతుక్కుంటూ స్టార్ట్ చేసిన జర్నీనే ఈ పాగల్.

ఈ సినిమాను దిల్ రాజు మేము.. రూ 5లో తీద్దాం అనుకుందాం. కానీ రాజుగారు పది మెట్లు ఎక్కించారు. న‌రేశ్‌ ఈ సినిమా కథ చెప్పినప్పుడు నాకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఈ మూవీతో పెద్ద హిట్టు కొట్టబోతున్నాము. బెక్కం వేణుగోపాల్, డైరెక్ట‌ర్, నేను మంచి ఫ్రెండ్స్ అయ్యాం. హీరోయిన్స్ అందరూ చాలా బాగా చేశారు. మాములుగా శుక్రవారం మూవీస్ రిలీజ్ చేస్తారు. కానీ మేము పాగల్ కదా.. అందుకే శనివారం రిలీజ్ చేస్తున్నాం. ఆ రోజున పార్టీలు పబ్‏లలోనే కాదు.. థియేటర్లలో కూడా జ‌రుగుతాయి. చాలా మంది ఈ సమయంలో సినిమా విడుదల చేయడం కరెక్టా అని అడుగుతున్నారు.నేను వాళ్లకు చెప్పేది ఒక్కటే. సర్కస్‏లో సింహంతో ఎవరైనా ఆడుకుంటారు. కానీ నేను అడవికి వచ్చే ఆడుకునే టైపు. మూసిన థియేటర్లను కూడా ఈ సినిమాతో ఓపెన్ చేపిస్తా.. తప్పైతే నా పేరు మార్చుకుంటా. ఇండిపెండెన్స్ డే ఆగస్ట్‌15 కాని సినిమా థియేట‌ర్స్‌కి ఇండిపెండెన్స్ డే ఆగ‌స్ట్ 14 అన్నారు.

- Advertisement -