నానిపై మ‌ళ్లి కౌంట‌ర్ వేసిన శ్రీరెడ్డి..

216
srireddy, nani

రేప‌టి నుంచి బిగ్ బాస్ 2 ప్రారంభంకానుంది. 100రోజుల పాటు జ‌రిగే ఈషోలో మొత్తం 16 మంది కంటెస్టెంట్ లు పాల్గోన‌నున్నారు. ఇక ఈషో కు వ్యాఖ్యాత‌గా హీరో నాని వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఇప్ప‌టికే ఈషోకు సంబంధించిన ప‌లు ప్రోమోలు కూడా విడుల‌య్యాయి. ఇటివ‌లే ప్ర‌మోష‌న్స్ కూడా మొద‌లుపెట్టారు. గ‌త సిజ‌న్ లో 70రోజులు మాత్ర‌మే జ‌రిపిన ఈషోను ఈఏడాది 100రోజుల పాటు జ‌ర‌ప‌నున్నారు. 16 మంది స‌భ్యుల అల్ల‌రితో బిగ్ బాస్ హౌస్ ఆస‌క్తిక‌రంగా సాగ‌నుంది.

bigboss2దీంతో బిగ్ బాస్ 2 కోసం తెలుగు ప్రేక్ష‌కులంతా ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈషోలో పాల్గొంటున్న సెల‌బ్రెటీలు ఎవ‌ర‌నె దానిపై ఎటువంటి క్లారిటి రాలేదు. ఇటివ‌లే సోష‌ల్ మీడియాలో ప‌లువురి పేర్లు వినిపించినా వారు వ‌స్తార‌న్న‌ది కూడా క‌న్ఫామ్ లేదు. ఇటివ‌లి కాలంలో టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన శ్రీరెడ్డి కూడా ఈషోలో పాల్గోంటుంద‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారమ‌వుతోంది. అయితే శ్రీరెడ్డి మాత్రం నానిపై ప‌లు ర‌కాల ఆరోప‌ణ‌లు చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఇటివ‌లే నానిగాడి రాస‌లీల‌లు బ‌య‌ట‌పెడ‌తానంటూ త‌న ఫేస్ బుక్ లో తెలిపింది.

గ‌త కొద్దిరోజుల‌గా సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న ఈ వార్త‌ల‌కు బ్రేక్ వేసింది శ్రీరెడ్డి. నేను బిగ్ బాస్ 2లోకి వెళ్తున్న అని వ‌స్తున్న వార్త‌ల్లో వాస్త‌వం లేద‌ని తేల్చిచెప్పింది. ఇది నా దుర‌దృష్టం..నా ఫ్రెండ్స్ కు నన్ను అభిమానించే వారికి ఇది చేదు వార్త త‌న ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. ఈవార్త నా స్నేహితుల‌ను నిరాశ‌ప‌రిచినా..కొంత‌మందికి మాత్రం సంతోషాన్ని క‌లిగించిన వార్త అవుతుంద‌ని నాకు తెలుసు అని చెప్పింది. బిగ్ బాస్ 2లో పాల్గోనే వారు చాలా అదృష్ట‌వంతుల‌ని..వారికి ఆల్ ది బెస్ట్ అంటూ పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. ప‌రోక్షంగా నాని ఉద్దేశించి శ్రీరెడ్డి ఈవ్యాఖ్య‌లు చేసింద‌ని టాలీవుడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ నుడుస్తోంది.