‘ఎఫ్ 2’ లో దేవి శ్రీ ప్ర‌సాద్..

286
dsp, anil ravipudi
- Advertisement -

వ‌రుస‌గా మూడు సినిమాలు మంచి విజ‌యం సాధించ‌డంతో జోష్ లో ఉన్నాడు యువ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. కొత్త కొత్త క‌థ‌ల‌తో సినిమాలు తెర‌కెక్కించి టాలీవుడ్ లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకున్నాడు. మంచి సినిమాలు తీయ‌డంతో పాటు హీరోల‌కు మంచి గుర్తింపు తీసుకొస్తున్నాడు. ప‌టాస్ సినిమాతో క‌ళ్యాణ్ రామ్ ను ఫాంలోకి తీసుకొచ్చాడు. అలాగే సుప్రీమ్ తో సాయి ధ‌ర‌మ్ తేజ్ ను, రాజా ది గ్రేట్ తో ర‌వితేజ‌కు మంచి విజ‌యాన్ని అందించాడు.

F2 movie

ఇక అనిల్ రావిపూడి వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్ తో ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమా తీయ‌నున్నాడు. ఇటివ‌లే ఈసినిమా టైటిల్ లోగొను కూడా ఆవిష్క‌రించారు. ఈసినిమాకు ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించ‌నున్నారు. ఎఫ్ 2 (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌) పేరుతో ఓ సినిమాను తీయ‌నున్నాడు. ప్ర‌స్తుతం ఈసినిమాకు సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి.

ఈసినిమాకు దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్నారు. ఈవిష‌యాన్ని డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి త‌న ట్వీట్టర్ లో పోస్ట్ చేశాడు. మీతో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉంది స‌ర్ అంటూ ఎఫ్ 2 కు స్వాగతం అని దేవితో క‌లిసి దిగిన ఫోటోను ట్వీట్ చేశాడు. దేవిశ్రీ మ్యూజిక్ , దిల్ రాజు నిర్మాతగా వ్య‌వ‌హ‌రించ‌డంతో ఈసినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇక ప్ర‌స్తుతం వ‌రుణ్ తేజ్ సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో స్పేస్ బ్యాక్ డ్రాప్ లో ఓ మూవిని చేస్తున్నాడు. దానితో పాటు ఈసినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నారు. +మ‌రికొద్ది రోజుల్లోనే ఈసినిమాను ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపారు.

- Advertisement -