నా దుర‌దృష్టం.. కొంద‌రికి సంతోషం-శ్రీరెడ్డి

250
Srireddy
- Advertisement -

తెలుగు ప్రేక్ష‌కులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న‌ బిగ్‎బాస్2 రేప‌టి నుంచి ప్రారంభం కానుంది. ఇక ఈ కార్యక్ర‌మానికి నాని వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న విష‌యం తెలిసిందే. ఇందులో 16 మంది సెల‌బ్రిటీలు 100 రోజుల పాటు ఉండి ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నున్నారు.  కాస్టింగ్ కౌచ్‎పై ఆరోప‌ణ‌లు చేసి న‌టి శ్రీరెడ్డి సంచ‌ల‌నంగా మారిన విష‌యం తెలిసిందే.. బిగ్‎బాస్ హౌజ్‎లో పాల్గొనే 16 మంది సెల‌బ్రిటీలో  శ్రీరెడ్డి కూడా ఉన్నార‌ని వార్త‌లు వినిపించాయి.

Srireddy

అయితే ఈ వార్త‌ల‌పై న‌టి శ్రీరెడ్డి స్పందించింది. బిగ్‎బాస్2లో తాను పొల్గొనడం లేద‌ని చెప్పింది. ఇది నా దుర‌దృష్టం.. న‌న్ను అభిమానించే మిత్రుల‌కు, అభిమానుల‌కు చేదు వార్త అంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.  నేను బిగ్ బాస్2 లోకి వెళ్ల‌క‌పోవ‌డంతో కొందరు మాత్రం చాలా సంతోషిస్తున్నార‌ని  చెప్పారు. బిగ్‎బాస్‎లో పాల్గొనే స‌భ్యులంద‌రికి ఆల్ ది బెస్ట్ అంటూ పోస్టులో తెలిపింది.

మ‌రోవైపు కొంత మంది అభిమానులు మాత్రం శ్రీరెడ్డి ఉంటే షోకి మ‌రింత జోష్‌ వ‌చ్చేద‌ని అంటున్నారు.  ఎన్టీఆర్ వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హిరించిన బిగ్‎బాస్1 ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానే అల‌రించిన విష‌యం తెలిసిందే. తెలుగు బుల్లితెర‌పై అత్య‌ధిక వ్యూవ‌ర్స్ క‌లిగిన‌ ప్రోగ్రాంగా రికార్డు సృష్టించింది. ఇక నాని వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న బిగ్‎బాస్2 ప్రేక్ష‌కుల‌ను ఎంత‌మేర‌కు అల‌రిస్తుందో వేచి చూడాలి.

- Advertisement -