కాస్టింగ్ కౌచ్ గురించి ప్రస్తావన వస్తే అందరికి గుర్తొచ్చే పేరు శ్రీ రెడ్డి. కాస్టింగ్ కౌచ్ పై ఆవిడ అంతగా తిరుగుబాటు చేసి తెలుగు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఇప్పుడు చెన్నైకి మకాం మార్చిన ఆమె అక్కడున్న తమిళ ప్రముఖులను విమర్శించడం ప్రారంభించింది. తను ఊరికే ఎవ్వరిని తప్పు పట్టడం లేదని తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్తుంది శ్రీ రెడ్డి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి రుజువులు చూపించక పోవడం పై సోషల్ మీడియాలో ఆమె పై విమర్శలు వెల్లివెత్తుతున్నాయ్.
ఇదిలా ఉంటే ఈ మధ్య ఆమె ఒప్పుకున్న ఓ తమిళ సినిమాకు “రెడ్డి డైరీ” అని టైటిల్ ఖరారు చేయడం తో ఆ సినిమా శ్రీ రెడ్డి బయో పిక్ అని వార్తలు విస్తారంగా వ్యాప్తి చెందడం ప్రారంభించాయి. అయితే ఆ విషయం పై శ్రీ రెడ్డి వివరణ ఇస్తూ ఆ సినిమా బయోపిక్ కాదని,ఓ తమిళనటి కి సంబంధించినదని చెప్పుకొచ్చింది.బయోపిక్ కాదు అని చెప్పి మళ్ళీ ఓ తమిళనటికి సంబంధించినదని చెప్పడం పై సోషల్ మీడియాలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ సినిమాలో తను ఓ పోలీస్ క్యారెక్టర్ చేయబోతున్నట్టు చెప్పింది శ్రీ రెడ్డి. ఏది ఏమైనా శ్రీ రెడ్డి చెప్పిన ఆ సినిమా లో తన పాత్ర ఎంతవరకు ఉందో, ఆ కథ ఏ నటికి సంబంధించిందో తెలియాలంటే రెడ్డి డైరీ సినిమా వచ్చేంతవరకు ఎదురుచూడాల్సిందే.