హీరోకి లేడీ నిర్మాత నుంచి వేధింపులు

21
- Advertisement -

బాలీవుడ్ లో హీరో ఆదిత్యరాయ్ కపూర్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మంచి నటుడు అని అతనికి పేరు కూడా ఉంది. మరి అలాంటి నటుడికి నటన రాదు అని చాలా చిత్రాల నుంచి తీసి పడేశారట. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆదిత్యరాయ్ కపూర్ తన సినీ కెరీర్ గురించి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. ఆ ముచ్చట్లు ఏమిటో అతని మాటల్లోనే విందాం. “నేను నా సినీ జీవితం స్టార్ట్ చేసిన తొలిరోజుల్లో ఎన్నో ఆడిషన్స్‌లో పాల్గొన్నాను. కానీ చాలా వాటిల్లో నన్ను వాళ్ళు తిరస్కరించారు. నాకు నటన రాదు అని ఓ దర్శకుడు హేళన కూడా చేశాడు.

కానీ అవి ఎప్పుడూ అవి నాపై ప్రభావాన్ని చూపించలేదు. మనం నటులం కావాలనుకుంటే, తిరస్కరణలు కూడా అందులో ఒక భాగమేనని నేను నమ్మాను. ఇప్పటికీ నేను అది నిజమే అని భావిస్తాను. చాలా మంది నన్ను తక్కువ చేసి మాట్లాడతారు. కారణం.. నాకు గుర్తింపు వచ్చాక కూడా నేను ఇప్పటికీ ఆడిషన్స్‌కి వెళ్తూ ఉంటాను. ఎందుకంటే ఎప్పుడూ ఏ అవకాశం ఎలా వస్తుందో తెలియదు కదా. ఓ మంచి పాత్ర కోసం నేను ఎంత దూరం అయినా వెళ్తాను. అదే నాకు పాత్ర నచ్చకపోతే ఎంత డబ్బు ఇస్తా అన్నా నేను నటించను’ అంటూ ఆదిత్యరాయ్ కపూర్ చెప్పుకొచ్చాడు.

Also Read:Bro Review:పవన్ ” బ్రో ” హిట్ కొట్టాడా?

పైగా ఆదిత్యరాయ్ కపూర్ క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా క్రేజీ కామెంట్స్ చేశాడు. ‘ఈ విషయం గురించి నేను మాట్లాడాల్సి వస్తోంది అని ఎప్పుడూ అనుకోలేదు. వేధింపులు అనేవి కేవలం నటీమణులకు మాత్రమే ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు. నిజానికి నటులకు కూడా వేధింపులు ఉంటాయి. బాలీవుడ్ లో ఓ లేడీ నిర్మాత ఉన్నారు. ఆమెకు చాలా గొప్ప పేరు ఉంది. ఆమె సినిమాల్లో మరియు ఆమె వెబ్ సిరీస్ ల్లో ఛాన్స్ లు రావాలి అంటే.. ఆమెను మెప్పించాలి. ఆ మెప్పులో ఎన్నో రకాల వేధింపులు ఉంటాయి’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Also Read:మొక్కజొన్న పొత్తులు తింటున్నారా..!

- Advertisement -