సెప్టెంబర్ 13న.. 24 ముద్దులు..!

260
Hebah Patel, Arun Adith

ఈ మధ్య సినిమాల్లో సరసాల కంటెంట్ ఉండేకొద్దీ ఎక్కువవుతుంది. మొన్నీ మధ్య వచ్చిన RX 100 సినిమా తెలుగు సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ ని తరువాతి స్థాయి కి తీసుకెళ్లింది. ఆ సినిమా ఘన విజయం తో అలాంటి రొమాంటిక్ సీన్స్ ని హైలెట్ చేసేలా సినిమాలను తెరకెక్కిస్తున్నారు కొత్తగా వచ్చే దర్శకులు. ఈ రోజు రిలీజ్ ఐన “24 కిసెస్ ” సినిమా ట్రైలర్ కూడా దాదాపు ఇదే కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిందనే చెప్పాలి.

Hebah Patel, Arun Adith "24 Kisses" movie release date
రెండు సంవత్సరాల క్రితం “మిణుగురులు” అనే సినిమాతో పరిచయమై మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు అయోధ్యరాజ్ కృష్ణంశెట్టి దర్శకత్వం లో “24 కిసెస్” రావడం అందరికి చిన్న షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇటీవల రిలీజ్ ఐన ట్రైలర్ కూడా RX 100 కి ఏమాత్రం తగ్గనంత రేంజ్ లో కుర్రకారుకి పిచ్చెక్కించేలా ఉంది.కేవలం రొమాన్స్ మాత్రమే ప్రధానం కాకుండా ఓ మంచి కథతో ఈ సినిమా రాబోతుందని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.

Hebah Patel, Arun Adith "24 Kisses" movie release date

ఓ అమాయకపు అమ్మాయిని ఓ ప్లే బాయ్ లాంటి అబ్బాయి మాయ మాటలతో దగ్గర చేసుకుని ఆమెను లొంగదీసుకునే ప్రయత్నం లో ఎదురైనా పరిస్థితులు ఆ అబ్బాయి పై ఎలాంటి ప్రభావం చూపాయన్నది కథ యొక్క సారాంశంగా కనిపిస్తుంది. అదిత్ అరుణ్,హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 13 న ప్రేక్షకులముందుకు రాబోతుంది.అదే రోజున “యూ టర్న్”, “నన్ను దోచుకుందువటే” సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నా వాటికీ పోటీగా “24 కిస్సెస్ ” ను కూడా రిలీజ్ కి సిద్ధం చేయడాన్ని బట్టి దర్శకుడు సినిమా పై ఎంత నమ్మకంతో ఉన్నాడన్నది తెలుస్తుంది.