తెలంగాణలో వ్యాక్సిన్ తయారుకావడం గర్వకారణం: పోచారం

179
pocharam
- Advertisement -

తెలంగాణ లో కరోనా వ్యాక్సిన్ తయారవ్వడం మనకు గర్వకారణం అన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. అసెంబ్లీలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి జాతీయ జెండా ఎగురవేసిన పోచారం….దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఓక కులానికో ,మతానికో ,ఓక సంస్థ కో సంబంధించిన పండుగ కాదు ఇది ….130కోట్ల మంది పండుగ అన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం రాజ్యంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం….వ్యక్తులు మారినా , ప్రభుత్వాలు మారినా…మనం ఏం సాధించామో వెనకకు తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చాలా రంగాల్లో అభివృద్ధి సాదించాం….మరికొన్ని రంగాల్లో వెనకబడి ఉన్నాం అన్నారు.

ప్రపంచానికి అవసరమైన వ్యాక్సిన్ లో 60శాతం మనదేశంలో ఉత్పత్తి అవుతున్నాయి..ఇది మనం గర్వించదగ్గ విషయం అన్నారు. కరోనా వ్యాక్సిన్ కోసం అహోరాత్రులు శ్రమించిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా కారణం గా చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అన్నారు. దేశాన్ని కాపాడేది సైనికులు ,రైతులు…వీళ్ళిద్దరిని కాపాడితే ..దేశం బాగుంటుందన్నారు.

ఈ దేశం కోసం కుటుంబానికి దూరంగా ఎండనకా ,వాననకా సైనికులు మనదేశ రక్షణ కోసం కాపలాగా ఉన్నారు..అలాంటి వారికి ఎంత చేసినా తక్కువే అన్నారు. మనం కడుపునిండా తింటుంన్నాం అంటే రైతు ల చలవే అన్నారు. ఈ ఆరు సంవత్సరాలలో తెలంగాణ లో గణనీయంగా పంటల సాగు పెరిగిందన్నారు. తెలంగాణ లో ఓక కోటి పది లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీరు అందుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం లో దేశంలో అన్ని ప్రభుత్వాలు ఉంటె…ఈ దేశం వెనకకు తిరిగి చూసుకునే పరిస్థితి ఉండదన్నారు.

72 సంవత్సరాలలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఈ ప్రభుత్వం గణనీయమైన ప్రగతిని సాదించింది..దేశం అభివృద్ధి లో ఇంకా ముందుకు పోవాలంటే రాష్ట్రాలకు మరింత చేయూత ఇవ్వాలన్నారు. మన రాష్ట్ర పోలీసులు శాంతి భధ్రతలో దేశంలో మొదటి స్థానంలో ఉన్నారు..వారికి ప్రత్యేకంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం సహాకరించాలన్నారు.

- Advertisement -