గవర్నర్‌ను కలిసిన స్పీకర్‌ పోచారం..

49

తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సోమవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను రాజ్ భవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా పోచారం తన మనవరాలు వివాహానికి ఆహ్వానిస్తూ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు శుభలేఖను అందజేశారు. వివాహానికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు.