పార్లమెంట్ సమావేశాలపై స్పీకర్ ఓం బిర్లా క్లారిటీ…

15
speaker om birla

దేశరాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరిగిపోతూండటంతో పార్లమెంట్ సమావేశాల నిర్వహణపై సందిగ్దం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలపై క్లారిటీ ఇచ్చారు స్పీకర్ ఓం బిర్లా.

పార్లమెంట్‌ శీతాకాల సమవేశాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, త్వరలోనే ప్రభుత్వం తేదీలు నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు ఓం బిర్లా. కరోనా మహమ్మారి మధ్య అన్ని జాగ్రత్తలతో వర్షాకాల సమావేశాలు జరిగాయని ఈసారి కూడా సమావేశాల నిర్వహణ ఉంటుందని చెప్పారు.

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 25 నుంచి రెండు రోజుల పాటు వడోదరలోని కెవాడియాలో అఖిల భారత ప్రిసైడింగ్‌ అధికారుల సమావేశం జరుగనుందని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డే ప్రసంగించనున్నారని వెల్లడించారు.