ముషీరాబాద్‌లో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ ఇంటింటీ ప్రచారం..

22
srinivas goud

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్‌లో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ ఇంటింటీ ప్రచారం నిర్వహించారు. ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని అడిక్‌మెట్‌ డివిజన్‌లో ఉన్న నాగమయ్య కుంటలో పార్టీ కార్యకర్తలతో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. పార్టీ అభ్యర్థి హేమలత జయరాం రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా బట్టలు ఇస్త్రీ చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. కులవృత్తులను ప్రోత్సహించేలా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. నగరంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గురించి వివరించారు.

ఇక కేపీహెచ్‌బీ కాలనీలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థితో కలిసి మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ప్రచారం నిర్వహించారు. కేపీహెచ్‌బీలోని పలు కాలనీల అసోసియేషన్ల నేతలతో సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతివ్వాలని కోరారు.