పలు రాష్ట్రాల్లో మళ్లీ నైట్ కర్ఫ్యూ!

20
curfew

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీలో మరిన్ని కఠిన ఆంక్షలు విధించగా పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూను విధించాయి.

ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూ విధించగా తాజాగా రాజస్థాన్‌లో కూడా నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. రాజస్థాన్‌లో మొత్తం 8 జిల్లాల్లో నైట్ కర్ఫ్యూను అమలు చేయనున్నారు. జైపూర్,జోద్‌పుద్, కోటా, బికనెర్, ఉదైపుర్, అజ్మర్, అల్వార్, భిల్వారాలలో నైట్ కర్ఫ్యూను అమలు చేయనున్నారు.

రాష్ట్రంలో కరోనాను తగ్గించేందుకు పలు జిల్లాల్లో నైట్ కర్ఫ్యూను అమలు చేయనున్నాం అని తెలిపారు సీఎం అశోక్ గెహ్లాట్. బస్సు లేదా ట్రైన్ ద్వారా దూర ప్రాంతాలకు వెళ్లే వారు, అత్యవసర పరిస్థితిలో బయటికి వచ్చే వారికి మాత్రమే మినహాయింపు ఉంటుందని తెలిపారు.