లోక్‌సభ స్పీకర్‌గా బిర్లా ఏకగ్రీవం..

373
om birla
- Advertisement -

లోక్ సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్‌ పదవికి బిర్లా పేరును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపాదించగా వివిధ పార్టీల నేతలతో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా,గడ్కరీ,రాజ్ నాథ్‌ సింగ్ సమర్థించారు. ముజువాణి ఓటు ద్వారా బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు ప్రొటెం స్పీకర్‌ వీరేంద్ర కుమార్‌.

ఇండస్ట్రీయలిస్టు అయిన బిర్లా ప్రధానమంత్రి నరేంద్రమోడీ-అమిత్‌ షాలకు అత్యంత సన్నిహితుడు.రెండు సార్లు ఎంపీగా మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఓమ్‌ బిర్లా.. అంచెలంచెలుగా ఎదిగారు. 1991 నుంచి 12 సంవత్సరాల పాటు భారతీయ జనతా యువ మోర్చాలో కీలక నాయకుడిగా పని చేశారు.రాజస్థాన్‌ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షుడిగా పని చేశారు.

కోటా-బుందీ నియోజకవర్గం నుంచి 2014లో తొలిసారిగా ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019లో వరుసగా రెండోసారి 2.79 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

- Advertisement -