మొక్కలు నాటిన స్పీకర్ ఓంబిర్లా…

298
mp santhosh kumar

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా పార్లమెంట్ ఆవరణలో రుద్రాక్ష చెట్టును నాటారు స్పీకర్ ఓం బిర్లా. వారితో పాటు సభ్యులు కేశవ రావు , జోగినిపల్లి సంతోష్ కుమార్ , నామ నాగేశ్వర్ రావు , కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు . పార్లమెంట్ సమావేశాలకు హాజరై ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఎంపీ గారికి దినచర్యలో భాగమైంది .

ప్రతి రోజు గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతం కావాటానికి ప్రముఖులతో తానే స్వయంగా మాట్లాడి వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తూ తన వంతు బాధ్యత నిర్వహిస్తున్నారు . మొన్న ప్రభాస్ గారికి 1600 ఎకరాల దత్తత తీసుకోవటం ఎంపీ సంతోష్ కుమార్ గారి పాత్ర చాలా కీలకం . రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానం ఆవరణం లో 1000 మొక్కలు , ఇప్పుడు పార్లమెంట్ ఆవరణం లో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా గార్ల ని భాగస్వామ్యం చేసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతం కావడం లో కీలక భూమికి పోషిస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ గారికి పలువురు ప్రశంసిస్తున్నారు

ఇప్పటికే బీజేపీ,కాంగ్రెస్ సహా వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.