గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే..

63
gic

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన క్యాంప్ కార్యాలయంలో మొక్కలు నాటారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే.మానవులతో పాటు సకల ప్రాణికోటి మనుగడ వృక్షాలపైనే ఆధారపడి ఉందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ గారు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ IAS గారికి నిజామాబాద్ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్తికేయ IPS గారికి కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేతా IPS గారికి గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించాల్సిందిగా గ్రీన్ ఛాలెంజ్ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…..రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు హారతహరం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అమలు చేయడం జరుగుతోంది అని ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యులు యంపీ,శ్రీ సంతోష్ కుమార్ గారు ప్రవేశపెట్టిన గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలో పాల్గొనడం ద్వారా రానున్న రోజుల్లో భవిష్యత్తు తరాలవారికి కాలుష్య రహిత వాతావరణాన్ని అందించడం కోసం ప్రత్యక్ష భాగస్వామలవుదామని ఎస్పీ గారు అన్నారు..పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో ఆదర్శనీయం , ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందివ్వాలని అని అన్నారు.

జాతీయ అటవీ సంరక్షణ సంస్థ చేసిన సర్వే ప్రకారం మన రాష్ట్రం దేశంలోనే 5 వ స్థానం ఉన్నది అంటే కేసీఆర్ గారు చేపట్టిన హరిత హారం యొక్క ప్రతిఫలం, అయన దూర దృష్టికి నిదర్శనం అన్నారు.గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి జిల్లాలోని పోలీసు కార్యాలయాలలో విస్తృతంగా మొక్కలు నాటుతున్నామని తెలిపారు. అలాగె ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచిస్తూ సకాలంలో వర్షాలు కురవాలన్నా, వాతావరణ సమతుల్యత కావాలన్నా మొక్కల పెంపకం ఒక్కటే మార్గమని అన్నారు. మన భావితరాలకు కాలుష్యం లేని పర్యావరణం అందించాల్సిన నైతిక బాధ్యత మనపైనే ఉన్నదని తెలిపారు.