బీజేపీ…భారతీయ ఝూటా పార్టీ:మంత్రి హరీశ్ రావు

185
harishrao
- Advertisement -

బీజేపీ పార్టీకి సరికొత్త నిర్వచనం చెప్పారు మంత్రి హరీశ్ రావు. బీజేపీ అంటే భారతీయ ఝూటా పార్టీ అని మండిపడ్డారు. దుబ్బాక మండలం రాజక్కపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీశ్…బీజేపీ గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టారు.

మోదీ అధికారంలోకి వస్తే ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామన్నారని, ఆరేళ్లలో ఆరు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని, ఎంత మందికి జాబ్‌లు ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఉండకపోయేదనని, కేసీఆర్‌ హయాంలో 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నారన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు రాష్ట్రంలో లక్షా 24వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని… కాంగ్రెస్‌కు ఓటేస్తే కాలిపోయే మోటార్లు.. బీజేపీకి ఓటేస్తే బాయి కాడా మోటార్లు అన్నారు. ఇంటింటికీ నీళ్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మోరీలో వేసినట్టేనన్నారు.

ఉత్తమ్‌, బండి సంజయ్‌కి ఏం ఎరుక రాజక్కపేట కష్టాలు అన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. సోలిపేట రామలింగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారన్నారు.

- Advertisement -