కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు…

385
southwest monsoon
- Advertisement -

కొద్దిరోజులగా తీవ్ర ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు గడ్ న్యూస్. నైరుతి రుతు పవనాలు కేరళాను తాకాయి. పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో బలపడిన అల్పపీడానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

ద్రోణి ప్రభావంతో భానుడి ప్రతాపం కాస్త తగ్గగా ఋతుపవనాల ప్రభావంతో లక్షదీప్, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఏపీలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇక కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు క్రమంగా దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

- Advertisement -