పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి:గాదరి కిశోర్

452
gadar kishor
- Advertisement -

మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో పట్టణ ప్రగతి సమగ్ర పారిశుద్ధ్య కార్యక్రమంకు ముఖ్యఅతిథిగా తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ హాజరై ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. రాబోయే వర్షాకాలంలో పట్టణాల్లో, గ్రామాల్లో సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం జూన్ 1 నుంచి 8 వరకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు వారం రోజులు శానిటేషన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

మహమ్మారి కరోనా వైరస్ పైన చేస్తున్నటువంటి యుద్ధం ఆ అనుభవంతోనే మున్సిపాలిటీ ప్రజలకు,అధికారులు, ప్రజలకు పూర్తి అవగాహన ఉంది, తుంగతుర్తి నియోజకవర్గంలోని మోత్కూర్ మున్సిపాలిటీ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం జరిగింది ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు మున్సిపల్ సిబ్బంది బాగా శ్రమిస్తున్నారు ప్రతి ఒక్కరూ మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు ఏ ఉద్దేశ్యంతో అయితే మంత్రి కేటీఆర్ గారు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంను ప్రారంభించారో పారిశుద్ధ్య కార్యక్రమం సఫలీకృతం అయ్యే విధంగా అధికారులు,మున్సిపల్ చైర్పర్సన్,కౌన్సిలర్లు,సిబ్బంది ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు .

ఈ వారం రోజుల్లో పట్టణాల్లో,గ్రామాల్లో వార్డుల్లో కూడా చెత్త చెదారం లేకుండా,మురికి గుంతలు లేకుండా శానిటేషన్ సిబ్బంది తో కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. గ్రామ,పట్టణ ప్రజలు అందరూ సహకరించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రి మేఘారెడ్డి,వైస్ చైర్మన్ వెంకటయ్య,మార్కెట్ వైస్ చైర్మన్ యాకుబ్ రెడ్డి,కౌన్సిలర్లు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -