ట్రెండింగ్‌లో #Sorryrakul!

158
rakul

టాలీవుడ్‌ను మరోసారి డ్రగ్స్ వ్యవహారం షేక్ చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు రియా చక్రవర్తిని విచారిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో డ్రగ్స్ లింక్స్ వ్యవహారంలో రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్‌ ఉన్నట్లు ప్రచారం జరుగడంతో అంతా షాక్‌కు గురయ్యారు. అయితే ఈ వార్త‌లను కొట్టిపారేశారు ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్ట‌ర్ కేసీబీ మ‌ల్హోత్రా.

విచార‌ణ‌లో రియా చ‌క్ర‌వ‌ర్తి ఎలాంటి పేర్లను వెల్లడించలేదని స్పష్టం చేశారు. దీంతో సోషల్ మీడియాలో #Sorryrakul, #Sorrysara హ్యాష్ ట్యాగ్ లు ట్రెండింగ్‌లో ఉన్నాయి.