25 మంది ఎంపీలకు కరోనా..!

175
Lok Sabha

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పార్లమెంట్‌ సభ్యులందరికి కరోనా పరిక్షలు నిర్వహించారు. పార్లమెంట్‌ సచివాలయంలో జరిగిన కరోన నిర్ధారణ పరీక్షల్లో 25 మంది ఎంపీలకు పాజిటివ్ అని తేలింది. ఇందులో 17 లోక్ సభ సభ్యులు,8 మంది రాజ్యసభ సభ్యులకు వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. వీరిలో బిజెపి 12, వైసీపీ 2, శివ సేన, డీఎంకే, ఆర్ఎల్పీ పార్టీలకు చెందిన ఒక్కో సభ్యుడికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది.

కరోనా పాజిటివ్ వచ్చిన 17మంది ఎంపీలు వీరే..

  • జనార్దన్ సింగ్,బిద్యుత్ బరణ్,ప్రదాన్ బారువా,జి. సెల్వమ్,ప్రతాప్ రావ్ పాటిల్,రామ్ శంకర్ కతేరియా,సత్యపాల్ సింగ్,రోద్మాల్ నాగర్,ఎన్.రెడ్డెప్ప,గొడ్డేటి మాధవి,మీనాక్షి లేఖి,అనంత్ కుమార్ హెగ్డే,పర్వేశ్ సాహిబ్ సింగ్,సుఖ్ బీర్ సింగ్,హనుమాన్ బేణివాల్,సుకనాటా మజుందార్,ప్రతాప్ రావ్ జాదవ్.