జీ తెలుగు… సరికొత్త సీరియల్‌ నాగభైరవిలో రమ్యకృష్ణ!

324
ramyakrishna

కరోనా లాక్ డౌన్ తర్వాత తెలుగు టెలివిజన్ సీరియల్స్ షూటింగ్ తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే జీ తెలుగు,జెమిని,ఈటీవీలలో పలు సీరియల్స్‌ని రెగ్యులర్‌గా ప్రారంభమయ్యే వారిసంఖ్య రోజురోజుకి పెరిగిపోతుండగా అంతేస్ధాయిలో కొత్త సీరియల్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.సినిమాలతో పోటీపడుతూ టీఆర్పీ రేటింగ్ సాధిస్తుండటంతో సరికొత్త ధారావాహికలు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీ తెలుగులో నాగభైరవి అనే కొత్త సీరియల్ రాబోతుంది.

సోషియో ఫాంటసీ నేపథ్యంలో వస్తున్న ఈ సీరియల్‌లో వెండితెర శివగామి కీలక పాత్ర పోషించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రొమోను రిలీజ్ చేసింది జీ తెలుగు. ఈ ప్రొమోలో రమ్యకృష్ణ పూజలు చేస్తూ కనిపించగా అష్టనాగు ఆమె భవిష్యత్ తరాలకు సంబంధించి ఓ విషయం చెబుతుంది. టైటిల్‌ రోల్‌లో యాష్కి నటించగా నాగార్జున పాత్రలో పవన్ సాయి నటించారు. ఈ సీరియల్‌ని భారీగ్రాఫిక్స్‌తో నిర్మిస్తు