టైట్ జీన్స్ వేసుకుంటున్నారా?..అయితే మీకోసమే

60
- Advertisement -

కాలం మారుతున్నకొద్దీ మనమూ మారాలి. కానీ…ఆ మార్పే ప్రమాదంగా మారితే..ఎలా ? ఇప్పుడు కొత్త ట్రెండ్‌ ను ఫాలో అవుతున్నవారు చాలామందే ఉన్నారు. అందులో అమ్మాయిలే ఎక్కువ. అసలు ఇదంతా ఎందుకంటారా..? కొత్త ట్రెండ్‌, కొత్త ట్రెండ్‌ అంటూ ఫాలో అవుతుంటే.. ఇప్పుడదే కొంపముంచేలా ఉంది. ఈ కొత్త ట్రెండ్స్‌ వల్ల కొత్త రిస్క్‌లు వచ్చిపడుతున్నాయి. ట్రెండ్ ని ఫాలో అవుతూ..స్పీడ్‌గా చేంజ్‌ అయ్యేవారికి ఇప్పుడు బ్రేక్‌ పడేలా ఉంది.

టైట్‌ జీన్స్‌, టైట్‌ డ్రెస్‌లు వేసుకునేవారికి హల్త్‌ ప్రాబ్లమ్స్‌ తప్పదట. ఇలాంటి బట్టలు వేసుకోవడం వల్ల నడుము నొప్పితో పాటు కీళ్లు అరిగిపోయే ప్రమాదముందని అంటున్నారు నిపుణులు. ఓ సర్వే లెక్కల ప్రకారం ప్రతీ పది మందిలో ముగ్గురు.. ఫ్యాషన్ ఫాలో అవుతున్నవారు నడుము నొప్పితో బాధపడుతున్నారట. టైట్ జీన్స్ ధరించి నడిస్తే నరాల మీద, కీళ్ల మీద ఒత్తిడి పడడమే కాకుండా రక్త ప్రసరణకు కూడా సరిగ్గా జరగదట.

1,062 మంది మహిళలను ఈ సర్వేలో ప్రశ్నించగా అందులో 73 శాతం మందికి నడుము నొప్పి ఉన్నట్లు తేలింది. అందులో 48 శాతం మందికి బిగుతు జీన్స్ వల్ల వచ్చినట్టు తెలిసింది. అంతేకాకుండా జీన్స్, పెద్ద టోపీలు, నెక్లెస్‌లు, బరువైన హ్యాండ్ బ్యాగుల వాటివల్లే అనారోగ్యం పాలవుతున్నారట. ఇది విన్నవారంతా..రక్షణ కోసం వేసుకునే బట్టలే కొత్త రోగాలు తెచ్చిపెడితే ఎలా అనుకుంటున్నారు. ఏదేమైనా ఇలాంటి ప్రమాదం ఉన్నప్పుడు వాటికి దూరంగా ఉండటమే బెటర్‌ కదా ఆలోచించండి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -