పిక్ టాక్ : ఎరుపు అందాలండోయ్ !

27
- Advertisement -

బాలీవుడ్ హాట్ భామ నుష్రత్ బరుచా పేరు తెలుసా ?, సౌత్ లో ఈ భామ నటించిన సినిమాలు ఇంకా విడుదల కాలేదు. హీరో సుధీర్ బాబు ఆ మధ్య ఓ హిందీ దర్శకుడితో ఓ సినిమా చేద్దాం అనుకున్నాడు. ఈ సినిమాలో నుష్రత్ బరుచానే హీరోయిన్. అయితే ఈ సినిమా అసలు ఉందా లేదా అనే క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రస్తుతం కొట్టుమిట్టాడుతూ ఉంది. కాబట్టి, ఒకవేళ ఈ సినిమా ఉంటే.. నుష్రత్ బరుచా తెలుగువారికి పరిచయం అవుతుంది.. లేకపోతే మరో సినిమాతో మన ముందుకు వస్తుంది. అయితే అప్పటివరకు ఎందుకు ?, ఈ లోపే సోషల్ మీడియా ద్వారా మీకు అందాల ట్రీట్ ఇస్తా అంటూ నుష్రత్ బరుచా నిత్యం హాట్ హాట్ ఫోటోలు వదులుతుంది.

నిజానికి నుష్రత్ బరుచాకి నెటిజన్లను తన అందాలతో టీజ్ చెయ్యడం కొత్తేమీ కాదు. అసలు ఈ భామకు క్రేజ్ వచ్చిందే.. ఈ టైప్ టాలెంట్ తోనే. ఇప్పటికే అన్ని హాట్ ఫోజులను కవర్ చేసేసింది. మొత్తానికి హాట్ గా కనిపించడం అనేది తనకు వెన్నతో పెట్టిన విద్య అని నుష్రత్ బరుచా నిరూపించింది. ఈ క్రమంలోనే నుష్రత్ బరుచా వరుస ఫోటో షూట్స్ చేసింది. తన హాటు ఘాటు సంప్రదాయాలు.. గ్లామర్ ప్రతిష్ఠ ఏ మాత్రం దెబ్బతినకుండా నుష్రత్ బరుచా ఓ కత్తి లాంటి డ్రెస్ వేసుకుని క్రేజీ పోజులిచ్చింది.

రెడ్ కలర్ స్లీవ్ లెస్ గౌన్ లో అందాల వడ్డన చేస్తూనే స్టైల్ గా నుంచొని కనిపించింది నుష్రత్ బరుచా. దీనికితోడు నుష్రత్ బరుచా మేకప్ కూడా చక్కగా కుదిరింది. అలాగే అమ్మడు హెయిర్ స్టైల్ అంతకంటే చక్కగా కుదిరింది. ఇక నుష్రత్ బరుచా ఫేస్ లో హస్కీ నెస్ తో కూడిన సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ కూడా అదిరిపోయింది. మొత్తమ్మీద నుష్రత్ బరుచా రెడ్ ఫోటోలకు ఆమె గ్లామరసానికి నెటిజన్ల హృదయాలు జిల్లుమన్నాయి. నుష్రత్ పిక్స్ ను తెగ లైక్ చేసి పారేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -