కరోనా నియంత్రణలో భాగంగా సింగరేణిలో లే-ఆఫ్

387
Singareni
- Advertisement -

ప్రపంచాన్ని కబలిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలలో భాగంగా డి‌జి‌ఎం‌ఎస్ మరియు చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ మైన్స్ సర్కులర్ ను అనుసరిస్తూ సింగరేణి సంస్ధలో కూడా ఈ రోజు సెకండ్‌ షిఫ్ట్ నుండి లే-ఆఫ్ ప్రకటించడం జరిగిందని జి‌ఎం పర్సనల్ ఆర్‌సి, ఐ‌ఆర్&పి‌ఎం ఏ.ఆనందరావు ఓ ప్రకటనలో తెలియజేశారు.

పని జరిగే 5 మెకనైజ్డ్ గనులలో మరియు డిపార్ట్మెంట్లలో సానిటైజర్ల మరియు మాస్కులను ఏర్పాటు చేస్తున్నామని, గనులు మరియు ఆఫీస్ ఆవరణలో సానిటైజర్లు స్ప్రే చేస్తున్నామని, అత్యవసర ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు విధిగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, కాలనీలలో కెమికల్ స్ప్రేయింగ్ కూడా చేయడం జరుగుతుందని తెలియజేశారు. లే-ఆఎఫ్‌ లో ఉన్న ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు కూడా ప్రభుత్వం వారు సూచించిన కరోనా వైరస్ ను నియంత్రించే ఆరోగ్య నియమాలను పాటిస్తూ, ఇంటివద్దనే ఉండాలని కోరారు. ఈ లే-ఆఫ్ వలన 22000 మంది ఉద్యోగులు ఎఫెక్ట్ ఔతారని తెలియజేశారు.

సింగరేణి సంస్ధలో మొత్తం 27 అండర్గ్రౌండ్ గనులు ఉండగా, దానిలో అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్, వి‌కే-7 ఇంక్లైన్, శాంతిఖని, జి‌డి‌కే-11ఏ ఇంక్లైన్, కొండాపూర్ అనే 5 మెకనైజ్డ్ మైన్స్ మరియు అన్నీ ఓపెన్ కాస్ట్ గనులు పనిచేయడం జరుగుతుందని తెలియజేశారు. పై 5 అండర్‌గ్రౌండ్ గనుల మినహా, మిగతా 22 అండర్‌గ్రౌండ్ మైన్స్ పూర్తిగా లే-ఆఫ్ ప్రకటించడం జరిగిందని తెలియజేశారు. అదే విధంగా ఆయా ఏరియాలలోని డిపార్ట్మెంట్ల శాఖాధిపతులు, ఆయా డిపార్ట్మెంట్లలో అవసరాన్ని బట్టి ఉద్యోగులను కేటాయించడం జరుగుతుందని తెలియజేశారు.

- Advertisement -