ఏకగ్రీవాల్లో హరీష్ రావు నెంబర్ వన్

172
Harish-Rao

స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వీలైనన్ని ఎంపీటీసీ స్ధానాలను ఏకగ్రీవం చేసేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యేలు. ఇందుకోసం ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ తీసుకుని మిగతా పార్టీ అభ్యర్ధులతో చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏకగ్రీవ ఎన్నికలు ఎక్కువగా జరుగుతున్నాయి. మొదట నామినేషన్లు వేసిన అభ్యర్దులు ఆ తర్వాత ఉపసంహరించుకుంటున్నారు.

తాజాగా సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో 227 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అంతేకాకుండా 10ఎంపీటీసీలు ఏకగ్రీవం అయ్యాయి. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు ప్రత్యేక చొరవతో పలువురు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో 96 ఎంపీటీసీ స్ధానాలకు 10 ఏకగ్రీవం కాగా మిగతా 86 స్ధానాల్లో ఎన్నికలు జరుగనున్నాయి.

వీలైనన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్ధానాలు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు మాజీ మంత్రి హరీష్‌ రావు. ఒకే నియోజకవర్గంలో 10 ఎంపీటీసీ స్ధానాలు ఏకగ్రీవం చేసి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచింది సిద్దిపేట నియోజకవర్గం