కాంగ్రెస్,బీజేపీ దొందు దొందే:అఖిలేష్

416
akhilesh

కాంగ్రెస్,బీజేపీ రెండు దొందు దొందేనన్నారు యూపీ మాజీ సీఎం,ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ ఆయన యూపీలో కాంగ్రెస్ ఎక్కడా బలమైన అభ్యర్థులను నిలపలేదన్నారు.

యూపీ ప్రజలు కాంగ్రెస్ పక్షాన లేరన్న అఖిలేష్ ఈ విషయం తెలిసే కుంటిసాకులు వెతుకుతున్నారని తెలిపారు. బీజేపీ,కాంగ్రెస్ రెండింటికి తేడా లేదని కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలను భయపెట్టాలని చూస్తున్నాయని చెప్పారు.

ఇదిఇలా ఉండగా యూపీలోని ఓ సభలో ప్రియాంక మాట్లాడుతూ మా అభ్యర్థి గెలవడమో లేదా బీజేపీ అభ్యర్థి విజయాన్ని అడ్డుకోవడమో జరుగుతుంది కానీ యూపీలోని ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్డీ కూటమి ఓట్లను చీల్చం అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అసలు కాంగ్రెస్‌కు పడే ఓట్లే తక్కువని ఆ పార్టీని ప్రజలు విశ్వసించడం లేదని పేర్కొన్నారు.