వీరమాచినేనికి చైనాలో అరుదైన గౌరవం..

367
vrk
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్లకు బీపీ పెంచి వారికి నిద్రలేకుండా చేస్తున్న వ్యక్తి వీరమాచినేని రామకృష్ణ. ఎక్కువ ఫ్యాట్‌తో ఎక్కువ ఆరోగ్యం అంటూ విజయవాడ వాసి సృష్టించిన కొత్త డైట్ ప్లాన్ ఏపీ,తెలంగాణలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాను చెప్పిన డైట్‌ని పాటిస్తే బీపీ,షుగర్‌ను తరిమేస్తానని సవాల్ విసిరిన వీఆర్కే తన డైట్ ప్లాన్‌తో ప్రజల్లో మన్ననలు పొందారు.

ఈ నేపథ్యంలో వీరమాచినేనికి అరుదైన గౌరవం దక్కింది. వీఆర్కే డైట్- ఇండియాను గుర్తిస్తూ ప్రముఖ చైనీస్ వైద్య అధ్యయన కేంద్రం చాంక్జింగ్ ఒక బ్లాక్ కు ఆయన పేరును పెట్టింది. చాంక్జింగ్ వైద్య పరిశోధన కేంద్రంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిపాదనలో ఉన్న వివిధ డైట్స్ పై పరిశోధన సాగుతూ ఉంటుంది. అలా వీఆర్కే డైట్ పై కూడా పరిశోధన జరిగింది. భవిష్యత్తులో ఈ అంశం మీద మరింత పరిశోధన సాగడానికి ఒప్పందం కూడా కుదిరింది. చైనీస్ వర్సిటీలో భారతీయ విధానానికి ఈస్థాయి గుర్తింపు దక్కడం విశేషం.

వీరమాచినేని డాక్టర్‌ కాదు.పోషకాహార నిపుణుడూ కాదు.లెక్కలతో కుస్తీ పట్టే చార్టెర్డ్‌ అకౌంటెంట్‌. కానీ ప్రస్తుతం వేలాదిమంది జీవితాల తిండీ-తిప్పలను మార్చేస్తున్నారు. చర్చలు, సమావేశాలు, యూట్యూబ్‌ వీడియోలతో హల్‌చల్‌ సృష్టిస్తున్నారు. ఇది వినండి.. ఇలా తినండి.. షుగర్‌ పరార్‌. జీవన శైలి రోగాలన్నీ గాయబ్‌ అని తేల్చి చెబుతున్నారు.అతి తక్కువ కాలంలోనే ఆయన చెప్పిన డైట్‌ని ఫాలో అయ్యేవారి సంఖ్య లక్షలకు చేరుకుంది.

- Advertisement -