బిగ్ జోక్ అంటూ కోమటి రెడ్డికి హరీష్‌ రావు కౌంటర్

173
Harish Rao Komati Reddy Rajagopal

షరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి హరీష్‌ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. హరీష్‌ రావు కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారని…త్వరలోనే కేసీఆర్ కు బిగ్ షాక్ ఇవ్వనున్నారని.. కేసీఆర్ ప్రభుత్వం ఐదేళ్లపాటు ఉండదని మధ్యలోనే పడిపోతుందని కామెంట్ చేశారు.

రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో కోమటి రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్‌ రావు.కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ట్వీట్టర్ ద్వారా స్పందించారు హరీష్‌ రావు. రాజగోపాల్ రెడ్డి అన్నట్లుగా ఉన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ లను జోడి చేస్తూ బిగ్ జోక్ అని కామెంట్ చేశారు హరీష్‌ రావు.