త్వ‌ర‌లో 20 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ – హోం మంత్రి

165
Mohammad Mahmood Ali
- Advertisement -

తెలంగాణ పోలీస్ అకాడమీలో ఈరోజు ఎస్సైల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. మొత్తం 1,162 మంది ఎస్సైలు ఈ పరేడ్ లో పాల్గొన్నారు. వీరిలో 256 మంది మహిళా ఎస్సైలు ఉన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో హోం మంత్రి మ‌హ‌ముద్ అలీ, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డితో పాటు పోలీసు ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. శిక్ష‌ణ‌లో అత్యుత్త‌మ ప్ర‌తిభ చూపిన ఎస్ఐల‌కు హోంమంత్రి, డీజీపీ పుర‌స్కారాలు అంద‌జేశారు.

ఈ సంద‌ర్బంగా హోం మంత్రి మ‌హ‌ముద్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసులకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంద‌న్నారు మంత్రి మ‌హ‌ముద్ అలీ. త్వ‌ర‌లోనే మ‌రో 20 వేల పోలీసు నియామ‌కాలు జ‌రుపుతామ‌ని స్ప‌ష్టం చేశారు. క‌రోనా, భారీ వ‌ర్షాల్లోనూ పోలీసులు అందించిన సేవ‌లు అమోఘ‌మ‌ని కొనియాడారు. పేద‌ల‌కు సేవ‌లు చేయ‌డం ద్వారా ప్ర‌భుత్వానికి మంచి పేరు తేవాల‌న్నారు. పోలీసు స్టేష‌న్‌కు వ‌చ్చే ప్ర‌తి ఒక్క‌రికీ గౌర‌వం ఇవ్వాల‌న్నారు. పోలీసు అకాడ‌మీ ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు 1,25,848 మందికి శిక్ష‌ణ ఇచ్చామ‌ని తెలిపారు. 18,428 మంది ఎస్ఐలు, కానిస్టేబుల్స్ నియామ‌కాలు జ‌రిపామ‌ని చెప్పారు. శాంతి భ‌ద్ర‌తల ప‌రిరక్ష‌ణ‌కు ప్ర‌బుత్వం అత్యంత ప్రాధాన్య‌త ఇస్తుంద‌న్నారు.

- Advertisement -