శివకార్తీకేయన్ @ డాక్టర్ బాబు

38
shivakarthikeyan

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం డాక్టర్. దసరా కానుకగా అక్టోబర్ 9న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ఇప్పటికే తమిళంలో విడుదలైన సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ రాగా త్వరలో తెలుగులో పాటలను విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా సినిమా నిర్మాత కోటపాడి రాజేష్ మాట్లాడుతూ …డాక్టర్ మంచి మాస్ ఎంటర్టైనర్. విజయ్ తో ‘బీస్ట్‘ తీస్తున్న నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించారు. గతంలో శివకార్తికేయన్ శక్తి సినిమా మాకు లాభాలు తెచ్చింది. అక్టోబర్ 9న రానున్న ‘డాక్టర్’ కూడా అందరినీ అలరిస్తుందని పేర్కొన్నారు.

శివకార్తికేయన్ సరసన గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా కోటపాడి రాజేష్ఈ చిత్రాన్ని గంగ ఎంటర్టైన్మెంట్స్, ఎస్.కె ప్రొడక్షన్స్ తో కలసి నిర్మించారు. అనిరుధ్ సంగీతం అందించారు.