రాష్ట్ర బడ్జెట్ కు ఎన్నికల కోడ్ అడ్డంకికాదు:శశాంక్ గోయల్

99
ts

రాష్ట్ర బడ్జెట్ కు ఎన్నికల కోడ్ అడ్డంకి కాదని వెల్లడించారు ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని…పారదర్శకంగా, ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తాం అన్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి హైదరాబాద్ స్థానానికి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు, వరంగల్ ,ఖమ్మం, నల్గొండ స్థానానికి నల్గొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ గోదాం లో కౌంటింగ్ జరుగుతుందన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ పేపర్లు ఓపెన్ చేస్తాం అన్నారు.

రేపు ఉదయం 8 గంటల కి రాజకీయ పార్టీల సమక్షంలో బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేస్తాం…పోలయిన ఓట్లను 25 చొప్పున కట్టలుగా కడతారని తెలిపారు. మొత్తం ఓట్లను కట్టలు కట్టడానికి రేపు సాయంత్రం అవుతుందని…ఒక్కో కౌంటింగ్ టేబుల్ పై 40 కట్టలు అంటే వెయ్యి ఓట్లు పెడతారన్నారు. 8 హాళ్లలో కౌంటింగ్, ఒక్కో హల్ లో 7 టేబుల్స్ , మొత్తం 56 టేబుళ్ళు ఏర్పాటు చేశామని..రేపు సాయంత్రం మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారని వెల్లడించారు.

మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి 24 గంటల నుంచి 36 గంటలు పట్టే అవకాశం ఉందని….హైదరాబాద్ లో మూడు షిఫ్ట్ ల్లో కౌంటింగ్ సిబ్బంది పనిచేస్తారని…..నల్గొండలో నాలుగు షిఫ్టుల్లో సిబ్బంది పనిచేస్తారని వెల్లడించారు. పార్టీల ఏజెంట్ లకు ఫోన్స్, ఇతర సామగ్రి లోనికి అనుమతి ఉండదని….మూడు అంచెల పోలీస్ బందోబస్తు ఉంటుందన్నారు.

సిసి కేమెరా లు,వెబ్ క్యాస్టింగ్ పర్యవేక్షణలో ఎన్నికల కౌంటింగ్ ఉంటుందని….కౌంటింగ్ పక్రియ వేగవంతంగా పారదర్శకంగా జరిపేందుకు హైదరాబాద్ ,మహబూబ్ నగర్,రంగారెడ్డి కి అదనంగా మరో 9 మంది ఏఆర్వో లు నియామకం,నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానానికి మరో 11 మంది ఏఆర్వో లు నియామకం జరుగుతుందన్నారు. రౌండ్ రౌండ్ కి ఫలితాలను వెల్లడిస్తాం….నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కోసం ఈసీ షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. నల్గొండ జిల్లా పరిధిలో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చిందని….ప్రభుత్వ అధికారులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా పాటించాలన్నారు.