దేశవ్యాప్తంగా 14 స్ధానాలకు షెడ్యూల్ రిలీజ్..

126
cec

దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 14 స్ధానాల ఉప ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్‌ అయింది. ఏపీలోని తిరుపతి, కర్ణాటకలోని బెల్గాం లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు భారత ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది.

నాగార్జునసాగర్‌, గుజరాత్‌లోని మోర్వా హదాఫ్‌(ఎస్టీ), జార్ఖండ్‌లో మధుపూర్‌, కర్ణాటకలో బసవకల్యాణ్‌, మస్కీ(ఎస్టీ), మధ్యప్రదేశ్‌లో దామోహ్‌, మహారాష్ట్రలో పండర్‌పూర్‌, మిజోరాంలో సెర్చిప్‌(ఎస్టీ), నాగాలాండ్‌లో నోక్‌సేన్‌(ఎస్టీ), ఒడిశాలో పిపిలి, రాజస్థాన్‌లో సాహరా, సుజన్‌ఘర్‌(ఎస్సీ), రాజ్‌సమండ్‌, ఉత్తరాఖండ్‌లో సాల్ట్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలైంది. ఏప్రిల్‌ 17న పోలింగ్‌ జరగనుండగా మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి.