ప్రశంసలతో పాటు పైసలిస్తే బాగుండు: ఎర్రబెల్లి

84
minster errabelli

కేంద్రం ప్రశంసలతో పాటు పైసలు కూడా ఇస్తే బాగుంటుందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. నీతి అయోగ్ రెక‌మండ్ చేసి‌న విధంగా నిధులు కూడా ఇస్తే బాగుంటుంద‌ని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్.. రాజ్యసభలో ప్రశంసించడం బాగుందని అన్నారు. ఇందుకు కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు ఎర్రబెల్లి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి న‌ల్లా నీరు అందిస్తున్నదని తెలిపిన ఎర్రబెల్లి… అయితే గ‌తంలోనూ వంద శాతం ఆవాసాల‌కు, ఇంటింటికి న‌ల్లాల ద్వారా మంచినీరు అందిస్తున్న రాష్ట్రంగా, అన్ని స్కూల్స్, అంగ‌న్ వాడీ కేంద్రాల‌కు మంచినీరు అందిస్తున్న రాష్ట్రంగా, ఫ్లోరైడ్ ర‌హిత, శుద్ధి చేసిన‌‌ మంచినీటిని అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ‌ను కేంద్రం అభినందించిందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.