- Advertisement -
కరోనా వైరస్ ముప్పు పూర్తిగా తొలగిపోనందున ఉద్యోగులు అందరూ అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని, కొత్త సంవత్సరం అందరికీ మేలు చేయాలని ఆకాంక్షించారు అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంత కుమారి.
అరణ్య భవన్ లో జరిగిన కొత్త సంవత్సర వేడుకల్లో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఉద్యోగులతో కలిసి కేక్ కట్ చేశారు. పచ్చదనం పెంపు, పర్యావరణ రక్షణకు ప్రాధాన్యతను ఇస్తూ కొత్త సంవత్సరంలో అందరూ మరింత బాగా పనిచేయాలని ఆకాంక్షించారు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్. శోభ.
అటవీ శాఖ ఉద్యోగ సంఘాలు తయారు చేసిన క్యాలెండర్, పోస్టర్ లను ఈ సందర్భంగా విడుదల చేశారు. అరణ్య భవన్ లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు, సిబ్బంది పరస్పరం కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
- Advertisement -