కట్టా మృతిపట్ల పువ్వాడ సంతాపం..

31
puvvada

మాజీ ఎమ్మెల్యే,సీపీఎం సీనియర్ నేత కట్టా వెంకటనర్సయ్య మృతిపట్ల మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన పువ్వాడ…. ఖమ్మం జిల్లాకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.

మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య (87) నిన్న రాత్రి పొద్దుపోయినతర్వాత కన్నుమూశారు. ఆయన గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో శుక్రవారం రాత్రి మృతిచెందారు.