ఉత్తమ్‌వి అసత్య ప్రచారాలు: సైదిరెడ్డి

40
shanampudi

కాళ్లేశ్వరం ప్రాజెక్టు ప్రపంచవ్యాప్తంగా ఓ అద్భుత ప్రాజక్ట్ అంటూ అభినందిస్తూ ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అది చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు హుజుర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. హుజుర్‌నగర్‌ టీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సైదిరెడ్డి..టీఆర్ఎస్‌పై ఉత్తమ్ చేస్తున్నవన్ని అసత్య ప్రచారాలే అన్నారు.

కాంగ్రెస్‌ మాటలు దేశంలో, రాష్ట్రంలో ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. గతంలో గృహనిర్మాణ శాఖ మంత్రిగా పని చేస్తున్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో జరిగిన అవినీతి మరచిపోయారని విమర్శించారు. రైతు బాగుంటే దేశం బాగుంటుందని సీఎం కేసీఆర్ అనేక ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నారని తెలిపారు. గత చరిత్రలో ఎక్కడా లేని విధంగా చెరువులు, కుంటలు అన్నీ కూడా జలకళను సంతరించుకున్నాయని తెలిపారు