శభాష్..కరీంనగర్ పోలీస్

321
karimnagar police

పోలీస్ అంటే శాంతి భద్రతలను కాపాడేవాడే కాదు.. ప్రజలు ఆపదలో వుంటే ఆదుకోవాలని నిరూపించాడు ఓ పోలీస్. చేపల వేటకు బావిలో దిగి శ్వాస ఆడక ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరు వ్యక్తులను కాపాడారు జమ్మికుంట సీఐ సృజన్ రెడ్డి.

వివరాల్లోకి వెళ్తె..కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లె గ్రామానికి చెందిన మల్లయ్య(45),మారేపల్లి రవీందర్(45) చేపల కోసం మంచినీటి బావిలో దిగారు. కొంతసేపటికే శ్వాస అందకపోవడంతో బావిలో చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు 108తో పాటు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో వెంటనే ఘటనా స్ధలానికి చేరుకున్న సీఐ సృజన్ రెడ్డి తానే స్వయంగా బావిలోకి దిగి ప్రాణాలు కాపాడారు. ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వారిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. మల్లయ్య,రవీందర్‌లను కాపాడిన సీఐ సృజన్ రెడ్డికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.