మాంసం ధరలు పెంచితే కఠిన చర్యలుః మంత్రి త‌ల‌సాని

278
talasani
- Advertisement -

చికెన్, మ‌ట‌న్, చేప‌ల ధ‌ర‌లు పెంచితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్. కరోనా,లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో మాంసం,చేపల సరఫరా పై మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష సమావేశం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, పశుసంవర్ధక శాఖ, పౌల్ట్రీ మత్స్య శాఖల ఉన్నతాధికారులు పాల్గోన్నారు.

ఈసంద‌ర్భంగా మంత్రి త‌ల‌సాని మాట్లాడుతూ…క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌పంచం అత‌లాకుత‌లం అయింద‌న్నారు. ఈ వైర‌స్ ను అరిక‌ట్టేందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎప్ప‌టిక‌ప్పుడు సమీక్ష నిర్వ‌హిస్తూ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ధైర్యం నింపుతున్న‌ట్లు తెలిపారు. మాంసం ధరలను కట్టడి చేయడానికి స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తాం అని చెప్పారు. పౌల్ట్రీ ఇండస్ట్రీ మీద లేని పోనీ రూమర్స్ క్రియేట్ చేసారు.చికెన్ తింటే ఎలాంటి ఇబ్బంది లేదు.మటన్ రేట్ మాత్రమే పెరిగింది. చేపలు మార్కెట్లో ఉంటే అన్ని మాంసాల రేట్లు కంట్రోల్ లో ఉంటాయన్నారు. ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి చేపలు తెచ్చి అమ్ముకోవడానికి స్పెషల్ పర్మిషన్ ఇస్తాం అన్నారు. మాంసం తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అన్నారు.

- Advertisement -