చొప్పదండిలో మొక్కజోన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం..

61
sunke ravishanker

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం మల్లన్న పల్లి గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ మొక్కజొన్న వెసిన రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు.అధికారులు సూచించిన విధంగా తమ పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని తెలిపారు.

కొనుగోలు కేంద్రం వద్ద ప్రజలు గుమ్మిగూడకుండా తమ పంటను అమ్ముకోవాలి.దళారులకు పంటను అమ్మకండి.ప్రభుత్వం ప్రతి ధ్యానంపు గింజా కొనుగోలు చేస్తుంది.మద్దతు ధర చెల్లిస్తుందని తెలిపారు.పంట కొనుగోలు విషయంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు,కరోనను కట్టడి చేయడం లో భాగంగా రైతు లు చేతులు కడుకోవాని చూసిచ్చిన్నారు.

ఈ కార్యక్రమంలో చొప్పదండి సింగిల్ విండో చైర్మైన్ వెల్మ మల్లారెడ్డి, ఎంపీపీ చిలుక రవిందర్, సింగిల్ విండో వైస్ ఛైర్మన్ ముద్దం మల్లేష్, సర్పంచ్ లింగంపల్లి లావణ్య , గన్ను శ్రీనివాస్ రెడ్డి ,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.