సరికొత్త ఫీచర్‌తో మెసెంజర్‌ యాప్‌..

322
- Advertisement -

ఇప్పట్లో సోషల్‌మీడియాని వాడని వారుండరు. ఇప్పుడు అందరూ సోషల్‌ మీడియాలోనే కొన్ని వ్యవహారాల్ని సెటిల్‌ చేసేసుకుంటున్నారు. ఇక సహజంగానే మనం ఆర్థిక లావాదేవీల వివరాలను, వ్యక్తిగత అంశాలను కూడా కుటుంబ సభ్యులతోనే పంచుకుంటాం. అయితే  సోషల్‌మీడియా సైట్లలో ఛాటింగ్‌ ద్వారా అలాంటి విషయాలను పంచుకోవడం ఏమాత్రం మంచిది కాదు అంటున్నారు నిపుణులు.
  Secret Conversations in messenger aap
ఎందుకంటే.. మనకు తెలియకుండానే హ్యాకర్లు, గూఢచార సంస్థలు మన విలువైన సమాచారాన్ని దొంగలించే అవకాశం చాలా ఎక్కువగానే ఉంది. ఇకనుంచి ఆ భయం లేదు అంటుంది ఫేస్‌బుక్‌. అందుకోసం మెసెంజర్‌ యాప్‌లో ‘సీక్రెట్‌ కన్వర్‌జేషన్‌’ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లోనూ ఇప్పుడు వాట్సాప్‌.. వైబర్‌ తీసుకొచ్చిన ‘ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌’ విధానం అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ఇద్దరి మధ్య జరిగే సంభాషణలు మూడో వ్యక్తికి అర్థమయ్యే పరిస్థితి ఉండదు.

వాటిని ఫేస్‌బుక్‌ యాజమాన్యానికి.. ప్రభుత్వ నిఘా సంస్థలు కూడా అర్థం చేసుకునే వీలుండదు. అలాగే ‘సీక్రెట్‌ కన్వర్‌జేషన్‌’ ఫీచర్‌ను ఎనేబుల్ చేస్తే మనం పంపిన మెసేజ్‌లు మనం ఎంచుకున్న కాల వ్యవధిలో తొలగించబడతాయి. అది ఎంత సమయంలో అంటే సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజుల్లోగా తొలగిపోయేటట్లు ఏర్పాటు చేసుకోవచ్చు.
 Secret Conversations in messenger aa
ఈ సదుపాయం తాజాగా విడుదలైన గూగుల్‌ ‘అల్లో’ యాప్‌లోనూ ఉంది. మరో విశేషమేమిటంటే.. ఒక డివైజ్‌ నుంచి పంపిన సందేశాలను మరో డివైజ్‌లో లాగిన్‌ అయ్యి చూసుకునే వీలుండదు. ఉదాహరణకు.. స్మార్ట్‌ఫోన్‌లోని ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ ద్వారా జరిపిన సంభాషణలు డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌లో లాగిన్‌ అయ్యి చూస్తే కనిపించవు.

ఆండ్రాయిడ్‌.. ఐఓఎస్‌ వెర్షన్‌లో మెసెంజర్‌ యాప్‌ను అప్‌డేట్‌ చేసుకుంటే ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని ఫేస్‌బుక్‌ తెలిపింది. ఇక వార్తతో ఫేస్ బుక్‌ యూజర్లు తెగ సంబరపడిపోతున్నారనే చెప్పాలి.

- Advertisement -