మెటా ఉద్యోగుల ఉద్వాసన

268
- Advertisement -

ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లుతున్నాయా…ప్రపంచ దేశాలు ద్రవ్యోల్భోణంతో కొట్టుమిట్టాడుతున్నాయా…ఆవుననే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంస్థలు తమ ఉద్యోగులను ఊస్టింగ్‌ ఆర్ఢర్‌.ఇస్తూ ఇంటికి పంపిస్తున్నారు.

తాజాగా ట్విట్టర్‌ బాటలో ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా ఉద్యోగాల కోత మొదలు పెట్టింది. కంపెనీల్లో పనిచేస్తున్న 11వేల మందికి ఉద్వాసన పలుకుతున్నట్టు ప్రకటించింది. ఉద్యోగుల సంఖ్యను 13శాతం మేర తగ్గించుకుంటున్నట్టు మెటా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జుకర్ బర్గ్‌ బుధవారం ట్వీట్టర్ ద్వారా ప్రకటించారు.

ఉద్యోగుల తొలగింపు విషయాన్ని మెటా చరిత్రలో కఠినమైన రోజుగా జుకర్‌బర్గ్‌ అభివర్ణించారు. కంపెనీలోని13శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో పాటుగా వచ్చే యేడాది తొలి త్రైమాసికం వరకు కొత్తగా ఎటువంటి నియామాకాలు ఉండవని కూడా ప్రకటించారు. దాంతోపాటుగా ఖర్చులను కూడా తగ్గిస్తున్నట్టుతెలిపారు. తొలగించిన ఉద్యోగులకు16వారాల వేతనంతో కూడిన లభిస్తుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి..

బద్ధకం పోవాలంటే ఈ సూచనలు..

సెక్సియెస్ట్‌ మ్యాన్‌ గా క్రిస్‌ ఎవాన్స్‌

త్వరలో పెళ్లి పీటలపైకి కోలీవుడ్‌ హీరో…

- Advertisement -