ఐ యామ్‌ బ్యాక్‌: ట్రంప్‌

54
- Advertisement -

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫేస్‌బుక్ మరియు యూట్యూబ్‌ అకౌంట్‌లను తిరిగి పునరుద్దరించారు. ఈమేరకు ట్రంప్ ఐయామ్ బ్యాక్‌ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. అయితే 2020 ఎన్నికల సందర్భంగా ట్రంప్‌ అధ్యక్ష బరిలో ఒటమి చెందిన విషయం తెలిసిందే. దాంతో జనవరి6, 2021న యూఎస్‌ క్యాపిటల్‌పైకి తన మద్దతుదారులను ఊసిగొల్పిరాని అనే కారణంతో ట్రంప్ యొక్క సామాజిక ఖాతాలను బ్యాన్ చేశారు. దీంతో గత రెండున్నర యేళ్లుగా ట్రంప్ సోషల్‌ మీడియా ద్వారా తన మద్దతుదారులకు ఎలాంటి సమాచారం అందించలేకపోయారు. అయితే గతేడాది ట్వీట్టర్‌ను కొనుగోలు చేసిన మస్క్‌ఎలన్‌…ట్రంప్‌ అకౌంట్‌ను పునరుద్దరించారు. అయితే వచ్చే యేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తనపై ఉన్న నిషేధంను సోషల్‌మీడియా సంస్థలు ఎత్తవేశాయి. దీంతో మళ్లీ తను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి నేరుగా వెళ్లే అవకాశం లభించినట్టయింది. అమెరికా యొక్క అత్యంత రహస్యమైన పత్రాలు అపహరించిన నేరాభియోగాలు కూడా ట్రంప్‌ పై మోపబడ్డాయి.

ఇవి కూడా చదవండి…

పట్టాభిషేక సంవత్సరం.. కోహినూర్‌ ప్రదర్శన

అరెస్ట్ ఖాయమే.. వాట్ నెక్స్ట్ జగన్ !

1980ల నాటి మిలిటరీ హోటల్ ప్రారంభం..

- Advertisement -