టాలీవుడ్ హీరోయిన్ సమంత వరుస సినిమాలో దూసుకుపోతుంది. అక్కినేని వారి ఇంట్లో అడుపెట్టాక అమెను వరుసగా విజయాలు వరిస్తున్నాయి. గతంలో ఈ అమ్మడు నటించిన రంగస్థలం సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆతరువాత అభిమన్యుడు, మహానటి సినిమాలలో నటించిన సమంత ప్రస్తుతం మరో మూడు సినిమాలో బిజీగా గడుపుతుంది. ఈ అమ్మడు రెండు తమిళ సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ప్రముఖ తమిళ నటుడు శివ కార్తికేయకు జోడీగా ఆమె ‘సీమరాజా’ చిత్రంలో నటించారు. మరోపక్క ‘యూ టర్న్’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
ఇక అసలు విషయం ఏంటంటే..‘సీమరాజా’ చిత్రం కోసం సమంత సిలంబం అనే మార్షల్ ఆర్ట్స్‌ను నేర్చుకున్నారు. ఈ చిత్రంలో సామ్ సిలంబం నేర్పించే టీచర్‌గా నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ‘సీమరాజా’ మూవీ నుండి సమంత పాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు చిత్ర బృందం. లంగావోణీలో పావురాన్ని చూస్తున్నట్లుగా ఉన్న ఆ పోస్టర్ నెటిజన్లను చాలా ఆకట్టుకుంటోంది. అయితే ఈ పోస్టర్‌ను ఓ నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ..‘ ‘సీమరాజా’లో సమంత సుతంత్ర దేవి అనే సిలంబం టీచర్ పాత్రలో నటిస్తున్నారు. ఇందుకోసం ఆమె మూడునెలల పాటు సిలంబంలో శిక్షణ తీసుకున్నారు’ అని పేర్కొన్నారు.
ఈ ట్వీట్ చూసిన సమంత సమాధానమిస్తూ..‘ఓ మై గాడ్. నేను సిలంబం నేర్చుకోవడానికి కేవలం 15 రోజులు మాత్రమే శిక్షణా తరగతులకు వెళ్లాను. నా నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించొద్దు.’ అని పేర్కొన్నారు. ఇందుకు మళ్లీ ఆ నెటిజన్ సమాధానం ఇస్తూ..‘మీరు మూడు నెలలు శిక్షణ తీసుకున్నారని దర్శకుడు పొన్రాం చెప్పారు. అందుకే మీ పాత్ర నుంచి కాస్త ఎక్కువే ఆశిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు. ఇందుకు సమంత ప్రతి స్పందిస్తూ..‘వద్దు’ అన్నట్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు.
Grrrrrrr https://t.co/pBNkixrXIH
— Samantha (@Samanthaprabhu2) July 26, 2018
🙏🙏🙏oh gosh .. I went for 15 classes .. please don’t expect some crazy stuff https://t.co/m7HOvCctUL
— Samantha (@Samanthaprabhu2) July 26, 2018