శ్రీవారి సన్నిధిలో సమంత..

44
sam

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సినీ నటి,అక్కినేని కోడలు సమంత. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న సమంతకు రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా.. ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

మ‌హాన్యాస ఏకాద‌శి రుద్రాభిషేకం పూజ‌లో పాల్గొన్న స‌మంత స్వామివారిని, అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. అనంతరం చిత్తూరు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర దేవాలయాన్ని దర్శించుకున్నారు.

స‌మంత ప్ర‌స్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది.ది ఫ్యామిలీ మ్యాన్2 వెబ్ సిరీస్‌లో నెగెటివ్ రోల్ పోషించి మంచి మార్కులు కొట్టేసింది. సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా విఘ్నేష్ శివ‌న్ డైరెక్ష‌న్‌లో ఓ సినిమాలోనూ నటిస్తోంది సామ్.